ఇటలీకి బయలుదేరిన అల్లు అర్జున్ ఫ్యామిలీ.. వీడియో ఇదిగో!

  • ఎయిర్ పోర్ట్ లో భార్యాపిల్లలతో అల్లు అర్జున్
  • నవంబర్ 1న టస్కానీలో వరుణ్, లావణ్య త్రిపాఠీ వివాహం
  • ఇటలీకి క్యూ కట్టిన పలువురు సినీ ప్రముఖులు
మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీ పెళ్లికి హాజరయ్యేందుకు సినీ ప్రముఖులు ఇటలీకి బయలుదేరుతున్నారు. ఎయిర్ పోర్ట్ లోకి ఎంటరవుతున్న ప్రముఖుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలో వరుణ్- లావణ్యల వివాహం జరగనుంది. ఈ వేడుక కోసం కాబోయే దంపతులు ఇప్పటికే కుటుంబ సభ్యులతో టస్కానీ చేరుకున్నారు. పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడానికి రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులు ముందుగానే ఇటలీకి చేరుకున్నారు. ఇక శుక్రవారం పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజనోవా కూడా ఇటలీ వెళ్లారు.

ఎయిర్ పోర్టులో పవన్, లెజనోవా ఫొటోలు వైరల్ గా మారాయి. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబం ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలు ఇటలీ వెళ్లేందుకు ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. ఫుల్ స్లీవ్డ్ టీ షర్ట్, బ్లాక్ జాగర్స్, స్నీకర్స్ తో అల్లు అర్జున్ స్టైలిష్‌గా కనిపించారు. స్నేహారెడ్డి డెనిమ్ జాకెట్, డెనిమ్ ప్యాంట్స్, బ్లాక్ క్రాప్ టాప్ ధరించారు. కాగా, హీరో నితిన్ కూడా భార్య షాలినీతో కలిసి ఇటలీకి బయలుదేరుతూ విమానాశ్రయంలో కనిపించారు. అక్టోబర్‌ 30న వరుణ్‌- లావణ్యల ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ప్రారంభం కానున్నాయి. కాక్‌ టైల్‌ పార్టీతో మొదలై అక్టోబర్‌ 31న మెహందీ, హల్దీ వేడుకలు జరుగుతాయి. నవంబర్‌ 1న వరుణ్‌, లావణ్యలు పెళ్లిపీటలెక్కనున్నారు. నవంబర్ 5న హైదరాబాద్‍లో వారి వెడ్డింగ్‌ రిసెప్షన్‌ జరగనుందని సమాచారం.

Allu Arjun
Varun Lavanya
wedding
Italy
Taskani
entertainment

More Telugu News